ఎ9 న్యూస్, మాసాయిపేట, ఆగస్టు 26:
మాసాయిపేట గ్రామంలోసోమవారం రాత్రి 8 గం. జరిగిన పిచ్చికుక్కల దాడి గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. 16 మంది గ్రామస్తులు ఈ దాడిలో గాయపడగా, వారిని తక్షణమే మెరుగైన చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులను కోరుతూ, “బాధితులకు సమయానికి మెరుగైన వైద్యసేవలు అందించాలనీ, అవసరమైన మెడికల్ సదుపాయాలను కల్పించాలనీ” సూచించారు.
గ్రామస్థులు ఈ ఘటనపై ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థపై నమ్మకం ఉంచుతూ స్పందించారు. స్థానిక అధికారుల పర్యవేక్షణలో కుక్కలను పట్టుకునే చర్యలు ప్రారంభించబడ్డాయి.








