హైదరాబాద్:అక్టోబర్ 26
తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల విషయంలో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రం లో మద్యం దుకాణాల ఏర్పాటుకు సోమవారం ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సి, హరికిరణ్, అధికారులను ఆదేశించారు.
జిల్లాల వారీగా దరఖాస్తులు ఎక్సైజ్ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా డ్రా ప్రక్రియను కొనసాగించను న్నారు. రాష్ట్రంలోనే మొత్తం 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి…
కొందరు గ్రూపుగా ఏర్పడి పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైన్స్‌లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.








