హైదరాబాద్:అక్టోబర్ 27
తెలంగాణలో మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభ మైంది ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95, 137 దరఖాస్తులు వచ్చిన సంగతి పాఠకులకు తెలి సిందే, ఈ దరఖాస్తులకు డ్రా పద్ధతిలో లైసెన్స్ ల ఎంపిక జరుగుతుంది…
మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ నెల 27వ తేదీన సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి నేతృత్వంలో లాటరీ తీసి, మద్యం దుకాణాలను కేటాయించేందుకు ఏర్పాట్లు చేసారు.జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి రెండు యూనిట్లు ఉండగా, సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా గెజిట్ లో ప్రచురించిన దుకాణాల క్రమ సంఖ్య ప్రకారం డ్రా తీస్తున్నారు.
మల్కాజిగిరి, మేడ్చల్ రెండు యూనిట్లుగా విభజించారు. మేడ్చల్ యూనిట్ లో 118 షాపులకు గాను 5,168 దరఖాస్తులు రాగా, మల్కాజిగిరి యూనిట్ లో ఉన్న 88 షాపులకు 6,063 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 206 షాపులకు 11,231 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అయితే దీనిని బట్టి చూస్తే తక్కువ మద్యం షాపులు కలిగి ఉన్న మల్కాజ్ గిరి జిల్లాలో ఎక్కువ దరఖాస్తులు, ఎక్కువ సంఖ్యలో మద్యం షాపులు కలిగి ఉన్న మేడ్చల్ జిల్లాకు తక్కువ దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది.








