సుర్బీర్యాల్‌లో అక్రమ నిర్మాణాల మూసివేత – న్యాయసేవ సంస్థ విజయవంతం …..  

On: Wednesday, August 20, 2025 9:53 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మండలంలోని సుర్బీర్యాల్ గ్రామంలో చెరువు స్థలంలో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్‌ను అధికారులు మూసివేశారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణం జరగడంపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో తహసీల్దార్, నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించి నివేదిక సమర్పించారు. దాంతో మడిగెలను మూసివేయించి, కిరాయిదారులకు నోటీసులు జారీ చేశారు.

ఇదే క్రమంలో తాళ్లరాంపూర్‌లోనూ విడిసి రద్దై, సాంఘిక వెలివేతలు ఆగిపోవడం ప్రజల్లో న్యాయంపై విశ్వాసం పెంచుతోంది. చట్టమే అంతిమమని రుజువవుతున్న ఈ చర్యలు ఇతర గ్రామాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.

13 Jan 2026

Leave a Comment