ఆర్మూర్ దయానంద్ నగర్‌లో కుంకుమార్చన ఘనంగా నిర్వహణ…..

On: Sunday, August 31, 2025 2:01 PM

 

ఆర్మూర్, ఆగస్ట్ 31, 2025:

ఆర్మూర్ పట్టణంలోని దయానంద్ నగర్ కాలనీలో మున్నూరు కాపు నడింపంతా ఆధ్వర్యంలో శుభకార్యాలంకారంగా కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ప్రముఖ వేద పండితుడు గోపికృష్ణ పంతులు ఈ కార్యక్రమాన్ని మంత్రోచ్చారణలతో ఆరంభించి, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దారు.

కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, సంఘ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు హాజరై విశేషంగా ఆదరించారు.

ఈ సందర్భంగా నడిమి పంత అధ్యక్షుడు తెడ్డు బాల్ రెడ్డి, పెద్ద కాపులు పోల లింగం, భాశెట్టి దయాల్, టక్కుర్ దినేష్, కుంట చిన్నారెడ్డి తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

21 Jan 2026

Leave a Comment