జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఎం3 వెర్షన్ ఈవీఎంలతో ఓటింగ్…

On: Thursday, October 23, 2025 12:33 PM

 

హైదరాబాద్:అక్టోబర్ 23

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 211 మంది అభ్యర్థులకు సంబంధించి మొత్తం కలిపి 321 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 135,81 మంది అభ్యర్థు లవి సెట్ల నామినేషన్లను అధికారులు ఆమోదించా రు. మరో 186 సెట్ల నామినే షన్లను 130 మంది అభ్య ర్థులవి తిరస్కరించారు.

బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత తన అఫిడవిట్‌లో పలు అంశాలను పేర్కొనలేదని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. డిక్లరేషన్‌ ఇవ్వాలని సునీతకు రిటర్నింగ్‌ అధికారి సూచించారు. అలాగే, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ సమర్పిం చిన పత్రాల్లోనూ తప్పులు న్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ఆయనను రిటర్నింగ్‌ అధికారి వివరణ కోరారు. ఆ తర్వాత మాగం టి సునీత, నవీన్‌ యాదవ్‌ నామినేషన్లను అధికారులు ఆమోదించారు.

*ఎం3 వర్షన్ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్స్‌తో ఓటింగ్!*

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బ్యాలెట్‌ పేపర్లు వాడబోమని ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్‌ 11న జరిగే ఈ ఎన్నికల్లో ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ఎం3 వెర్షన్ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్స్‌ (EVMs)నే ఉపయోగిస్తామని తెలిపింది.

ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎం3 మెషీన్లతో ఒక కంట్రోల్‌ యూనిట్‌కు 24 బ్యాలటింగ్ యూనిట్లను కలుపుతూ గరిష్ఠంగా 384 మంది అభ్యర్థుల వివరాలు నమోదు చేయవచ్చు.ఎం3 మెషీన్లు ఎన్నికల సంఘం రూపొందించిన మూడవ తరం యంత్రాలు. వీటిలో ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయిల్‌ (వీవీపాట్‌) వ్యవస్థ ఉంటుంది. ఎం2 మెషీన్లు ఒక్క కంట్రోల్‌ యూనిట్‌కు 4 బ్యాలెట్‌ యూనిట్లను మాత్రమే కలుపుతాయి.

ఎం3 మెషీన్లతో 24 యూనిట్లు కలపవచ్చు. ప్రతి యూనిట్‌లో 16 మంది అభ్యర్థుల పేర్లు నోటాతో పాటు ప్రదర్శించ వచ్చు. ఈ సదుపాయం ద్వారా ఒక్క నియోజక వర్గంలో 384 మంది అభ్య ర్థుల వరకూ వివరాలు నమోదు చేయడం సాధ్యమవుతుంది అని చెప్పారు.

11 Nov 2025

Leave a Comment