దేగాం గ్రామ సర్పంచ్ గా ఇట్టేడి లింగారెడ్డి   ఏకగ్రీవం…..

On: Thursday, December 11, 2025 5:30 AM

 

ఆలూర్ మండలం దేగాం గ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. గ్రామ ప్రజల సమగ్ర మద్దతుతో ఇట్టేడి లింగారెడ్డి సర్పంచ్‌గా ప్రకటించబడ్డారు. ఎలాంటి పోటీ లేకుండా ప్రజలు ఒకే మాటతో ఎంపిక చేయడం గ్రామంలో విశేషంగా నిలిచింది.

ఎన్నిక అనంతరం లింగారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకం గ్రామంలోని ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ప్రతి నిరుద్యోగికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. దేగాం గ్రామాన్ని నిజామాబాద్ జిల్లాలోనే అగ్రగామిగా నిలపడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానని, గ్రామాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ఒకటి గా ముందుకు తీసుకెళ్తానని లింగారెడ్డి హామీ ఇచ్చారు

13 Jan 2026

Leave a Comment