ప్రశ్నించే గొంతులను అణచటం తగదు…

On: Sunday, August 3, 2025 6:55 AM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ నియోజకవర్గానికి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర నిమిత్తం విచ్చేసిన తరుణంలో, స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున విడుదలైన ప్రకటనలో, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని, వాటిపై ప్రశ్నించిన నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని తీవ్రంగా వ్యతిరేకించారు. “ప్రజల తరపున గొంతెత్తే నాయకులను పోలీసు బలగాలతో మోహరించి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య పరమార్ధానికి విరుద్ధం” అని ఆప్ నాయకత్వం విమర్శించింది.

“ప్రజా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి హక్కు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సహించలేక అరెస్టుల బాట పడుతోంది. ఇది దుర్మార్గం” అని ఆప్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పాదయాత్ర నేపథ్యంలో వదిలిన హామీల అమలుపై స్థానికంగా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండగా, ఆందోళనలను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు తీవ్రంగా వ్యవహరించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

21 Jun 2026

Leave a Comment