దళారులు డీల్స్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే పై అధికారులకు రిపోర్ట్ ఇస్తాము.
ఎ9 న్యూస్ ,చేగుంట, అక్టోబర్ 15:
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఉదయము 11:00 గంటలకి తహశీల్దార్ కార్యాలయములో లోని ఉన్న అన్ని మీసేవ మరియు ఇంటర్నెట్ సెంటర్ వారితో తహశీల్దార్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం వారి వద్దకి వచ్చిన దరఖాస్తుదారులను భూ భారతి, కళ్యాణ లక్ష్మీ మరియు ఇతర మీసేవ దృవపత్రముల విషయములో దరఖాస్తూకు చెల్లించాల్సిన డబ్బులకంటే ఎక్కువ డబ్బులు వసులు చేయకూడదు అని తాసిల్దార్ తెలిపారు. అదేవిధంగా మీసేవ దృవపత్రముల విషయములో దరఖాస్తూ చేసిన రెండు రోజులలో సంబందిత దరఖాస్తులు కార్యాలయములో ఇవ్వగలని అన్నారు. భూ భారతి స్లాట్ బుక్ మరియు భూముల విషయములలో ఎవరు దలారులు, మధ్యవర్తిత్వం పనులు చెయ్యరాదు అని మీసేవ సర్వీసులు నడుపుతున్న యజమానులకు ఆదేశించారు. ఎవరైనా వీటికి విరుద్దంగా చేసినచో చట్ట పరమైన చర్యలు తీసుకొని మీ యొక్క మీసేవ మరియు ఇంటర్నెట్ సెంటర్ల పై రిపోర్ట్ వ్రాసి పై అధికారులకు నివేదిక పంపుతామని హెచ్చరించనైనది అని చేగుంట తాసిల్దార్ పేర్కొన్నారు.








