
Oct 26, 2025,
ఎంజీఎంలో ఘటన.. మంత్రి దామోదర సీరియస్
తెలంగాణ : వరంగల్ ఎంజీఎంలో ఇద్దరు పిల్లలకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చడం, కనీసం బాధ్యత లేకుండా ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరుపై వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. హాస్పిటల్ సిబ్బందిని మొత్తం ప్రక్షాళన చేయడంతో పాటు ఉద్యోగుల వివరాలు, వారి పనితీరుపై నివేదిక ఇవ్వాలని హెల్త్ సెక్రటరీకి సూచించారు.








