బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం.
ఆర్మూర్, అక్టోబర్ 08 (A9 న్యూస్):
గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల సహకారంతో కల్లేడి గ్రామ మహాలక్ష్మి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఐమాస్ట్ లైట్‌ను ఈ రోజు గ్రామంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గంగోల్ల ప్రళయ్ తేజ్ మాట్లాడుతూ :
“మా గ్రామానికి ఒక ఐమాస్ట్ లైట్ అవసరం ఉందని చెప్పగానే వెంటనే ఎంపీ నిధుల ద్వారా అందించిన అరవింద్ అన్నకి అలాగే ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కి గ్రామ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షులు మచ్చర్ల అర్జీత్, బండారి మధు, ఐలి అరుణ్, మండల ఉపాధ్యక్షురాలు మోతె శ్రావణ్య, శక్తి కేంద్ర ఇంచార్జ్ మోతె అశోక్, గ్రామ ఇంచార్జ్ బోడిగం నాగేష్, సీనియర్ నాయకులు గంగోల్ల ప్రళయ్ తేజ్, భాశెట్టి గంగాధర్, యువ నాయకులు సిరికొండ సాయికుమార్, దుగ్గం దినేష్, సాయి చరణ్ తదితర బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.








