ఈవ్ టీజింగ్‌ జరిగితే వెంటనే షీ టీంకు సమాచారం ఇవ్వాలి – ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్…

On: Tuesday, December 23, 2025 9:54 AM

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకాపూర్ గ్రామంలో ఉన్న భార్గవి విద్యానికేతన్ పాఠశాలలో మహిళలు, విద్యార్థినిల భద్రతపై అవగాహన కల్పించే క్రైమ్ అవేర్‌నెస్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్ టీజింగ్ చేసినా భయపడకుండా వెంటనే షీ టీంకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్ టీజింగ్‌ లేదా ఇతర వేధింపులకు గురైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీం సహాయాన్ని తీసుకోవాలని అన్నారు. సమాచారం ఇచ్చే మహిళలు, విద్యార్థినిల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని, వారి భద్రతకు పోలీస్ శాఖ పూర్తి రక్షణ కల్పిస్తుందని తెలిపారు.

ఈవ్ టీజింగ్‌పై ఫిర్యాదు చేయడానికి షీ టీం నెంబర్ 8712659795 లేదా డయల్ 100

కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే క్యూ ఆర్ కోడ్ ద్వారా షీ టీంకు ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు. ఈ అవగాహన సదస్సులో ప్రధానోపాధ్యాయులు తులసి మేడం, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల భద్రతే లక్ష్యంగా పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

13 Jan 2026

Leave a Comment