హైదరాబాద్: అక్టోబర్ 22
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న ఉస్మాని యా నూతన ఆసుపత్రి నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, బుధవారం అధికారులను ఆదేశించారు.
ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో ముఖ్య మంత్రి .రేవంత్ రెడ్డి, బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన ఆసుపత్రి అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరా లను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్‌లు, ఇతర నిర్మాణలు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు అయన సూచించారు. ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు.
ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యు త్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకోకసారి సమా వేశమై ఏవైనా సమస్య లుంటే పరిష్కరించు కుంటూ పనులు వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు.
ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు.. ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించు కోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.
ఆసుపత్రికి వివిధ రహదా రులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులకు సీఎం సూచించారు…








