ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి నిలిచిపోయిందా? — ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి….

On: Saturday, December 6, 2025 9:18 PM

*రెండు సంవత్సరాలు పూర్తయినా నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించలేదని ఆక్షేపించారు…

*ఎమ్మెల్యే ప్రజల మధ్యలో లేరు, అభివృద్ధి వైపు దృష్టి సారించడం లేదు…”

*వైద్యం, విద్య, ఉద్యోగాలు… ఏదీ ముందుకు సాగడం లేదు…”

*నాయకుల మధ్య గొడవలకు ప్రజలు బలి కావొద్దు…”

*రాజకీయ విద్వేషాలు, వ్యక్తిగత కక్షలు నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోవడానికి కారణమని పేర్కొన్నారు…

*ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు నాయకులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు…

A9 న్యూస్ ఆర్మూర్:

ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయన్న అంశంపై ప్రజల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. గత ఎన్నికలు పూర్తయ్యి రెండేళ్లు అవుతున్నా, రహదారులు, డ్రైనేజీలు, విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో ప్రగతి కనిపించలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

   *ఎన్నికల తర్వాత అభివృద్ధి నిలిచిపోయిందంటూ ప్రజల విమర్శలు…

2023 ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నియోజకవర్గానికి నిధుల కేటాయింపు, స్కీమ్‌లు, అభివృద్ధి పనులు స్తబ్దుగా మారినట్లు ప్రజలు భావిస్తున్నారు.

ఇక అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి కూడా ప్రభుత్వ నిధులను తీసుకురావడంలో చురుకుగా వ్యవహరించాలనుకున్నా, ఇప్పటివరకు పెద్దగా మార్పు కనిపించలేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

“నాయకుల మధ్య మాటల ఘర్షణలు, ఆరోపణలు పెరుగుతున్నాయి కానీ అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు” అనే అభిప్రాయాలు సర్వసాధారణంగా వినిపిస్తున్నాయి.

*గతంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితిపై ప్రశ్నలు:

గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులతో పోల్చితే ప్రస్తుత కాలంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని కొంతమంది స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ లాంటి పథకాలు స్తంభించిపోయాయని వారు ఆరోపిస్తున్నారు.

*ఆర్మూర్ ప్రజలు మాత్రం ఒకే మాట చెబుతున్నారు:

“మాకు రాజకీయ గొడవలు కాదు, అభివృద్ధి కావాలి.” రాజకీయ నాయకులు పరస్పర విమర్శలకు కాకుండా అభివృద్ధి పట్ల దృష్టి పెట్టాలని ప్రజలు అభిలషిస్తున్నారు.

18 Jan 2026

Leave a Comment