హైదరాబాద్ :ఆగస్టు 16
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సంస్థ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ఈ చెల్లింపులు వ్యవస్థను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధ్రువీకరిస్తూ వచ్చింది. కొత్త కొత్త సదుపాయాలను తీసుకువచ్చింది అయితే ఇందులో భాగంగా అందుబాటులోకి తెచ్చిన కనెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ను మాత్రం త్వరలో నిలిపి వేయున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ సేవలో నిలిపివే యాలని పేమెంట్ యాప్స్ కు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సంస్థ సూచిస్తూ ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది.
బిల్లులు చెల్లించడం లేదా స్నేహితులు, బంధువులకు డబ్బు పంపడం ఏదైనా సరే అన్నింటికి వంటి యాప్‌లనే వాడుతున్నారు. కానీ, యూపీఐ పేమెంట్లలో మనీ రిక్వెస్ట్ ఫీచర్ అనేది ఇక కనిపించదు.ఈ ఫీచర్ కారణంగా సైబర్ మోసాలు ఎక్కువగా పెరిగిపోతున్న క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
వాస్తవానికి, ఫీచర్ పీర్-టు-పీర్ (P2P) కలెక్ట్ రిక్వెస్ట్’ అక్టోబర్ 1, 2025 నుంచి యూపీఐ యాప్‌ల లో అందుబాటులో ఉండదు.సైబర్ మోసగాళ్ళు ఈ ఫీచర్‌ను పెద్ద ఎత్తున వాడుతున్నారని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ చెబు తోంది. అందుకే ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు ఫీచర్ తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
యూపీఐలో ఈ ఫీచర్ సాయంతో ఏ యూజర్ అయినా మరో యూపీఐ యూజర్‌కు మనీ రిక్వెస్ట్ పంపవచ్చు. ఇతర యూపీఐ యూజర్ ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే వారి యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే డబ్బులు డెబిట్ అవుతా యి.యూపీఐ ప్రారంభంలో పేమెంట్లను మరింత సులభతరం చేసేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చారు. కానీ, కాలక్రమేణా ఇది స్కామర్ల కు ఆయుధంగా మారింది.
ఈ మోసాల కేసులు పెరిగి పోవడంతో నేషనల్ పేమెం ట్ కార్పొరేషన్ ఇప్పుడు ఈ ఫీచర్ యూపీఐ యాప్స్ నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇప్పుడు యూపీఐ యాప్ వాడే యూజర్లు ఇలాంటి మనీ రిక్వెస్ట్ పేమెంట్లు చేయ లేరు.నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ వారి ప్రకారం.. సైబర్ మోసగాళ్ళు ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తున్నా రు. ఈ మోసగా ళ్ళు ఫేక్ ఐడెంటిటీ లేదా ఎమర్జెన్సీ అంటూ వినియో గదారుల నుంచి మనీ రిక్వెస్ట్ పంపుతున్నారు.
అది నమ్మి యూపీఐ యూజర్లు ఆ రిక్వెస్ట్ అంగీకరిస్తే యూపీఐ పిన్ అవసరం లేకుండానే డబ్బులు బ్యాంకు అకౌంట్ నుంచి కట్ అయిపోతాయి. ఈ ఫీచర్ కోసం గతంలో రూ. 2వేలు లిమిట్ సెట్ చేసినా ఇప్పటికీ యూపీఐ చీటింగ్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ఈ మనీ రిక్వెస్ట్ ఫీచర్ పూర్తిగా నిలిపి వేయాలని ఎన్‌పీసీఐ నిర్ణయించింది.







