Oct 31, 2025,
తెలంగాణ : రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన తెలంగాణకు చెందిన 58 మంది క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను తిరిగి సొంత రాష్ట్రానికి పంపించేందుకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అవగాహన లోపం లేదా కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందినవారు ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందుతారు. గతంలో 2021లో జీవో 37 ప్రకారం రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి వచ్చిన 698 మంది తెలంగాణ ఉద్యోగులను ఇప్పటికే వారి సొంత రాష్ట్రానికి పంపించారు. మిగిలినవారు కూడా తమకు సొంత రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కొన్ని షరతులకు లోబడి వారిని తీసుకోవడానికి అంగీకరించింది.








