జి.జి నడుకుడా సర్పంచ్ రేసులో బట్టు సంజీవ్ రాజ్…..

On: Sunday, December 14, 2025 6:11 AM

 

కత్తెర గుర్తుతో మీ ముందుకు….

డొంకేశ్వర్ మండలం ,జి.జి నడుకుడా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బట్టు సంజీవ్ రాజ్ కత్తెర గుర్తుతో బరిలోకి దిగారు. గతంలో గ్రామాభివృద్ధి కోసం పనిచేసిన అనుభవంతో పాటు రాజకీయ అవగాహన కలిగిన నాయకుడిగా గ్రామ ప్రజల్లో విశ్వాసం సంపాదించారు.

గ్రామంలో విద్య, వైద్యం రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని, అలాగే పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి సకాలంలో అందేలా కృషి చేస్తానని గట్టిగా హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతానని, అన్ని వర్గాలను కలుపుకుని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. గ్రామ భవిష్యత్తు కోసం కత్తెర గుర్తుకు ఓటు వేసి బట్టు సంజీవ్ రాజ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు.

18 Jan 2026

Leave a Comment