తూప్రాన్ లో ఘనంగా స్వాతంత్ర్య పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు…..

On: Friday, September 26, 2025 5:17 PM

 

ఎ9 న్యూస్, తూప్రాన్ ,సెప్టెంబర్26:

మెదక్ జిల్లా తూప్రాన్‌ మండల కేంద్రం లో శుక్రవారం స్వాతంత్ర పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి తూప్రాన్ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాచారం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త, లయన్ లీడర్‌షిప్ చైర్మన్ లయన్ బుడ్డ భాగ్యరాజు మాట్లాడుతూ… చాకలి ఐలమ్మ తెలంగాణా రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించి, అన్యాయాలకు వ్యతిరేకంగా అఖండ ధైర్యంతో నిలబడి స్ఫూర్తిదాయకమైన చరిత్ర సృష్టించారని అన్నారు. నేటి యువత ఆమె జీవితం నుండి ప్రేరణ తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి, నాచారం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టముల ఉపేందర్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, బిజెపి మున్సిపల్ అధ్యక్షులు భూమన్నగారి జానకిరామ్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ లయన్ డాక్టర్ జానకిరామ్ సిఆర్, లయన్ డాక్టర్ అప్సర్ భాయ్, లయన్ కుమ్మరి రమేష్, రామునిగారి చిన్న నాగరాజు గౌడ్, భాయికాడి ముత్యాలు, కనుకొల్ల ఎల్లం, రాజయ్య, మామిండ్ల యాదగిరి, పోతరాజు లింగం, దన్ రాజు, శ్రవణ్, రాజు, భాయికాడి వెంకటేష్, భాయికాడి అంజి, బోల్లు నరేందర్, మర్యాల, కనుకొల్ల ఆంజనేయులు, అల్లాపురం ఎల్లము రజక, మామిండ్ల శ్రీశైలం రజక, మహేష్, తోపాటు తూప్రాన్ రజక సంఘం నాయకులు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

14 Feb 2026

Leave a Comment