కార్తీక మాసంలో పేదలకు అన్నదానం – సేవ్ లైఫ్ ఫౌండేషన్ సాయి ప్రభాస్ స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమం…..

On: Tuesday, November 4, 2025 3:24 PM

 

A9 న్యూస్, ఆర్మూర్ ప్రతినిధి:

కార్తీక మాసం పుణ్యక్షణాలను పురస్కరించుకుని,  ఇటికేబట్టిల వద్ద సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలు, నిరుపేదలకు ఘన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ ప్రతినిధి సాయి ప్రభాస్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:

“కార్తీక మాసం పవిత్రమైన నెల. ఈ నెలలో పేదలకు ఆహారం అందించడం ఎంతో పుణ్యఫలం ఇస్తుంది. సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్నదే మా సేవ్ లైఫ్ ఫౌండేషన్ లక్ష్యం.”

కార్యక్రమంలో ఫౌండేషన్ సేవాకార్యకర్తలు పాల్గొని, పేద ప్రజలకు అన్నపానీయాలు, త్రాగునీరు పంపిణీ చేశారు.

11 Nov 2025

Leave a Comment