ఎ9 న్యూస్ డెస్క్, అక్టోబర్ 15:
భారతదేశంలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా ఆధారంగా సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితులు ఏనాడో గతించిపోయినవి. చాలా ఆలస్యంగా నైనప్పటికీ సిపిఐ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ సాయుధ పోరాట విరమణ ప్రకటించి నెల రోజులు దాటిపోయింది. కామ్రేడ్ అభయ్ నాయకత్వంలో సాయుధ పోరాట విరమణ చేస్తూ సమానత్వ సాధన కోసం కమ్యూనిజం కోసం ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రజలను సంఘటితం చేయడానికి రాష్ట్ర డివిజన్ ఏరియా కమిటీ మెంబర్లతో సుమారు 60 మంది లీగల్ కావడం సమాజం స్వాగతించవలసిన విషయమే అవుతుంది.
అక్టోబర్ ,15 ,2025.
జంపన్న ( డెమొక్రటిక్ సోషలిస్ట్)
(నోట్: సైద్ధాంతిక రాజకీయ అవగాహనతో ప్రజాస్వామిక పద్ధతులలో స్పందించగలరు. కోపతాపాలు ద్వేషాలు మార్క్సిజం కాదు. ప్రజాస్వామిక పద్ధతి కాదు).








