రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపేయగా కారులో ఉన్న ముగ్గురు బయటకు దిగేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.








