నా ఊరి అభివృద్ధే నా ధ్యేయం – మీ ఆశీర్వాదమే నా బలం”.
ఆలూర్, అక్టోబర్ 08 (A9 న్యూస్):
ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ మండల పరిధిలోని గుత్ప తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఈసారి రైతు బిడ్డ నునవత్ రాములు నాయక్ బరిలో అడుగుపెట్టారు. గ్రామ ప్రజల మద్దతుతో “ఉరిని అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపించాలి” అనే సంకల్పంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
నునవత్ రాములు నాయక్ మాట్లాడుతూ :
“నేను ఈసారి ఒరిజినల్ అభ్యర్థిగా గుత్ప తండా ప్రజల ఆశీర్వాదాలతో బరిలో దిగుతున్నాను. నా ఊరి బాగు కోసం, ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం కష్టపడతాను.
గ్రామంలో నీటి సౌకర్యం, రహదారులు, విద్యుత్, మహిళల అభివృద్ధి, యువత ఉపాధి – ప్రతి రంగంలో మార్పు తీసుకురావడం నా లక్ష్యం.
మీ అందరి ఆశీర్వాదమే నా బలం,” అని తెలిపారు.
గ్రామ ప్రజల మధ్య విస్తృతమైన ఆదరణ పొందుతున్న రాములు నాయక్, సామాజిక సేవలో ముందుండి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలు వినిపించి పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుంటారన్న పేరు తెచ్చుకున్నారు.
ప్రజల అంచనాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించిన ఆయనకు యువత, రైతులు, మహిళల మద్దతు లభిస్తోంది. గ్రామంలో “ఈసారి రైతు బిడ్డ గెలవాలి – గుత్ప తండా అభివృద్ధి చెందాలి” అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి.








