
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి :
జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రములో రైతులను నిలువెల్లా ముంచి భారీ అవినీతి అక్రమాలకి పాలు పడ్డారని ఆరోపించారు, 326 మంది రైతులకు సంబంధించిన వడ్లలో అందరికి కోత కోసి ఖాతాల్లో వేయవలసిన నగదును మహిళా సంఘానికి సంబంధించిన వారితో వడ్లు కొనుగోలు చేసుకున్నాను అని ఒప్పందం చేసుకున్న జక్రాన్ పల్లి తండాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి ఎక్క మొత్తంలో తరుగు చేయడం అనాధికార కోత కోసి సుమారు (2000)సంచులు 40kg ల వడ్ల సొమ్మును అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్నాడు అని పడకల్ గ్రామ రైతులు ఆరోపించారు, అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రైతులు నష్టపోయినా సొమ్మును ఇప్పించాలని కోరారు..








