యూరియా కొరతతో రైతుల తిప్పలు – సరఫరా పెంచాలని విజ్ఞప్తి…..

On: Friday, September 12, 2025 12:05 PM

 

ఎ9 న్యూస్, చిన్న శంకరంపేట (ఆర్), సెప్టెంబర్ 12

చిన్న శంకరంపేట మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తెల్లవారకముందే స్థానిక సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు, చాలా సమయం వేచిచూసినా, యూరియా పొందడం కష్టంగా మారింది.

గవలపల్లి గ్రామంలోని సొసైటీ వద్ద యూరియా లారీ రాగానే రైతులు పెద్ద సంఖ్యలో చేరుకొని క్యూ లైన్లలో నిలబడ్డారు. జంగారై సొసైటీ వద్ద టోకెన్ల ద్వారా యూరియా పంపిణీ జరుగుతోంది. అయినప్పటికీ, సరిపడా బస్తాలు అందకపోవడంతో చాలామంది చేతి విర్లతోనే మళ్లీ వెనక్కి తిరుగుతున్నారు.

రైతులు ప్రభుత్వం తక్షణం స్పందించి అవసరమైన యూరియా బస్తాలను సరఫరా చేయాలని కోరుతున్నారు. పంట సాగు కీలక దశలో ఉన్న ఈ సమయంలో యూరియా లభ్యత లేకపోవడం ఆందోళనకరం అని వారు అంటున్నారు.

06 May 2026

Leave a Comment