ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మాజీ పటేల్ పట్వార్ సేతు సింధి నీరడీల సంఘం ఆర్మూర్ సర్వసభ్య సమావేశం ఆదివారం రోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. సంఘం యొక్క ముఖ్య సలహాదారుగా గంట సదానందం, అధ్యక్షులుగా అర్హులు సురేష్ ఉపాధ్యక్షులుగా మారంపల్లి రాజన్న, ప్రధాన కార్యదర్శిగా దోనకంటి లింగన్న, ఉప కార్యదర్శులుగా గైని సంజీవ్, అబ్బ బాపూరావు, కోశాధికారిగా మేకల ముత్యం, కార్యవర్గ సభ్యులుగా గున్ని సత్యం, దొనకంటి రాజేందర్, నీరడి దయాకర్, జగ్గుల రాజన్న, రాజేశ్వర్, నీరడి రాజేశ్వర్, పింజ సుదర్శన్, లను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గతంలో మేము పోగుచేసిన రూపాయలతో భవనాన్ని నిర్మాణం చేయడం జరిగిందన్నారు. దానికి అప్పటి పటేల్, పట్వారీలు, కందార్లు, సుంకర్లు, అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న భవనం కొందరు దాన్ని అమ్ముకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ నిరడి, సుంకర్లు, దాదాపు 90శాతం మంది మాల కులానికి చెందిన వారే ఉన్నారని, కొంత మంది ఇతర కులాలకు చెందిన వారు ఉన్నారన్నారు. ఆ భవనం పై కోర్టులో కేసు నడుస్తున్నది అన్నారు. గతంలో కలెక్టర్ ఉత్తర్వులు మాకు అనుకూలంగా ఇచ్చారన్నారు. ఏది ఏమైనా మేము దానిని సాధించి తీరుతామన్నారు. అది అందరి సొత్తు, కొందరు దాన్ని అమ్ముకోవడాన్ని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమాన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పటేల్ పట్వార్ సేతు సింధి నీరడీల సంఘం సభ్యులు పాల్గొన్నారు.








