మంథని గ్రామంలో ఎన్నికల దుమారం ప్రారంభం – మూడో వార్డు నుంచి చిట్యాల రాజవ్వ నామినేషన్ దాఖలు…..

On: Friday, December 5, 2025 5:09 PM

 

A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్

ఆర్మూర్ మండలం మంథని గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని 3వ వార్డు సభ్యురాలిగా చిట్యాల రాజవ్వ ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు.

వారి అనుచరులు, గ్రామ మహిళలు, పాల్గొని నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు రాజవ్వ స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మండల కార్యాలయానికి చేరుకున్నారు.

గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, శుభ్రత, వృద్ధాప్యులకు సకాలంలో సేవలు అందించడం వంటి అనేక అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తానని రాజవ్వ మీడియాతో వెల్లడించారు.

మందని గ్రామంలో ఈసారి ఎన్నికలు ఆసక్తికర పోటీకి వేదికగా మారనున్నాయి. స్థానిక ప్రజలు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, అభివృద్ధికి కట్టుబడి పనిచేసే నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.

కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, మహిళల సభ్యులు, పాల్గొన్నారు.

18 Jan 2026

Leave a Comment