హైదరాబాద్:అక్టోబర్ 27
తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయించింది.
కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం.. చెల్లింపుల విషయంలో స్పష్టమైన హామీ లేకపోవడం. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం మరో కారణం.ప్రభుత్వం దసరా పండుగకు రూ. 600 కోట్లు ఇస్తామని చెప్పి. కేవలం రూ. 200 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
అలాగే.. దీపావళి నాటికి మొత్తం చెల్లిస్తామని చెప్పినప్పటికీ.. ఆ హామీ కూడా నెరవేరలేదు. బకాయిల విడుదలపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే సమాఖ్య ప్రతినిధులు మంత్రులను కలిసి తమ సమస్యను వివరించిన ప్పటికీ.. సంతృప్తికరమైన హామీ లభించకపోవడంతో బంద్‌కు దిగక తప్పడం లేదని నిర్ణయించుకున్నారు. ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలే జీలు ఈ నిరసనను మరిం త తీవ్రతరం చేయాలని యోచిస్తున్నాయి.








