*12 రాష్ట్రాల్లో ఎస్ ఐ ఆర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ఈసీ…..

On: Monday, October 27, 2025 6:39 PM

 

హైదరాబాద్:అక్టోబర్ 27

ప్రత్యేక సమగ్ర సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది, దేశంలో రెండో విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ను మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది, మొత్తం 12 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండో విడత ఎస్ఐఆర్ చేపడతామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్ జ్ఞానేశ్ కుమార్, వెల్లడించారు.

బీహార్‌లో ఎస్ఐఆర్ విజయవంతమైందని, మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని నిర్వహించబోతున్నా మని తెలిపింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడు తూ…రెండో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను త్వరలో చేపట్టనున్నామని వెల్లడించారు.

1951 నుంచి 2004 వరకు ఎనిమిదిసార్లు ఎస్ఐఆర్ నిర్వహించారని అన్నారు. 21 ఏళ్ల కిందట ఓటర్ల జాబితా సవరణ జరిగిందని గుర్తు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నకిలీ ఓట్లు, అక్రమ వలసదారులు, చనిపోయి న, బదిలీ చేయబడిన ఓటర్లను తొలగించినట్లు వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

బీహార్‌లో 7.5 కోట్ల మంది తో ఎస్ఐఆర్ విజయవం తంగా పూర్తయిందని అన్నారు. బీహార్‌లో ఈ ప్రక్రియపై ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదని తెలియజేశారు. రెండో దశలోనూ ప్రతి ఇంటికి మూడుసార్లు వెళ్లి ఓటరుపై నిర్ధారణ చేసుకుంటామని, తెలిపారు. ఎస్ఐఆర్‌పై రాజకీయ అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు.

రెండో దశలో ప్రత్యేక సమగ్ర సవరణ జరగనున్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్ నికోబర్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్. రెండో దశ ఎస్ఐఆర్ జరగనున్న రాష్ట్రాల్లో 51 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని, నవంబర్ 4వ తేదీ నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. అసోంలో ఎన్ఆర్‌సీ ఉన్నందున ఎస్ఐఆర్ లేదని స్పష్టం చేశారు.

11 Nov 2025

Leave a Comment