నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. డీజేలు, టపాసులు పూర్తిగా నిషేధించబడ్డాయని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు ఆపాలని తెలిపారు. మండపాల వద్ద సురక్షిత విద్యుత్ సదుపాయాలు, ఫైర్ సేఫ్టీ చర్యలు తప్పనిసరి అని పేర్కొన్నారు. మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిమజ్జనం సమయంలో క్యూ పద్ధతి పాటించి, పెద్దలు మాత్రమే ముందుండాలని సూచించారు. అనుమానాస్పద వస్తువులు కనిపించిన వెంటనే 100 నంబర్ లేదా కంట్రోల్ రూమ్ (87126-59700)కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారంతో ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ నిఘా కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు.







