నల్గొండ పట్టణంలో మత్తు టాబ్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితులు, వాటిని సేవిస్తున్న ఐదుగురు వినియోగదారులను ఈగల్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు. వాహన తనిఖీల్లో ప్రధాన నిందితుడు జబీ ఉల్లా పట్టుబడ్డాడు. అతనిచ్చిన సమాచారం మేరకు మహబూబాబాద్కు చెందిన కృష్ణ సాయిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,400 స్పాస్మో ప్రోక్సివోన్ ప్లస్, 345 ట్రమడాల్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 మంది వినియోగదారులను గుర్తించగా, ఐదుగురిని అరెస్టు చేశారు.








