మెదక్: అగ్రహారం మరియు గవ్వలపల్లి గ్రామాల ప్రజలు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ మరియు సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
“ప్రతి నెల జీతాలు తీసుకునే అధికారులెందుకు తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించడంలేదు?” అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. గడిచిన కొన్ని వారాలుగా నీటి సరఫరాలో తీవ్రమైన అంతరాయం ఏర్పడినప్పటికీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం స్పందించకపోవడం ప్రజల్లో అసహనానికి దారితీసింది.
ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయం ఎక్కడుందో, ఎలా సంప్రదించాలో ప్రజలకు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
“ఒక్క తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఇంత కాలం పడుతుందా?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాము ఏ అధికారిని సంప్రదించాలో తెలియక తికమకపడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.








