మదన్‌పల్లి గ్రామంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా…

On: Saturday, December 6, 2025 6:29 PM

 

మాక్లూర్:

మాక్లూర్ మండలం మదన్‌పల్లి గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి, మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారి వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యూత్ అధ్యక్షుడు అసాది ఆఖిలేశ్ పాల్గొని, యువతకు అంబేడ్కర్ ఆశయాలను చేరువ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని మాట్లాడారు. సమాజంలో సమానత్వం, విద్య, స్వాభిమానంపై డాక్టర్ అంబేడ్కర్ చెప్పిన సందేశాలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

గ్రామంలోని పెద్దలు, స్థానిక నాయకులు, యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

18 Jan 2026

Leave a Comment