జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ప్రాబబుల్స్ జట్ల ఎంపిక:

On: Saturday, December 20, 2025 8:01 PM

ఈరోజు ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ క్రీడా మైదానంలో సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ బాల బాలికల జట్ల ఎంపిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జక్రాన్ పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ విచ్చేసి క్రీడను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా జట్లు గత పది సంవత్సరాల నుండి సాఫ్ట్ బాల్ క్రీడలో మంచి ఫలితాలను సాధిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ,మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్ర పోటీలలో ప్రథమ స్థానం సాధించి జిల్లా నుండి ఎక్కువ మంది క్రీడాకారులు జాతీయ పోటీలలో పాల్గొనాలని అన్నారు.

అలాగే జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ లు మాట్లాడుతూ జిల్లా నలుమూల నుండి 22 పాఠశాల 150 క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ యొక్క ఎంపికలో ప్రబబుల్స్ జట్టుకు బాలికలు 25 మంది బాలురు 25 మందిని ఎంపిక చేయడం జరిగింది ఎంపికైన క్రీడాకారులకు శిక్షణ శిబిరం నిర్వహించి తుది జట్టును ఎంపిక చేసి డిసెంబర్ చివరి వారంలో మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్ర పోటీలకు పంపుతామన్నారు.

ఈ కార్యక్రమంలో

సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి లు చిప్ప నవీన్, మర్కంటి సుజాత, సభ్యులు రమేష్, అనిల్, ప్రవీణ్,స్వప్న, వీణ,

శివకుమార్, సీనియర్ క్రీడాకారులు సాయికుమార్, తిరుపతి, రాహుల్, జిల్లా సాఫ్ట్ బాల్ కోచ్ నరేష్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

18 Jan 2026

Leave a Comment