జిల్లా పోలీస్ కార్యాలయం ,మెదక్ జిల్లా…..

On: Sunday, September 21, 2025 5:50 AM

 

 

పత్రికా ప్రకటన

తేదీ: 20-09-2025.

జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం జిల్లా పోలీస్ సిబ్బందికి పరేడ్ నిర్వహించడం జరుగుతుంది.

ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పరేడ్‌కు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు హాజరైయారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, యూనిఫాం డ్రస్ కోడ్, మరియు విధుల పట్ల చూపుతున్న చురుకుదనాన్ని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ –

పరేడ్‌ లో సిబ్బంది యొక్క ఫిట్‌నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పెంపొందించడంలో ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో ప్రతి పోలీస్ సిబ్బంది పౌరులతో మర్యాద, వినయంతో వ్యవహరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని సూచించారు.

నేర నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

పరేడ్ అనంతరం సిబ్బందితో సమావేశమై వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా ఆయన పరిశీలించారు. జిల్లా పోలీస్ విభాగం ఎల్లప్పుడూ ప్రజా భద్రత కోసం కట్టుబడి ఉందని అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు స్పష్టం చేశారు.

13 Jan 2026

Leave a Comment