మొబైల్ రికవరీ చేసిన ధర్పల్లి ఎస్సై…..

On: Friday, August 22, 2025 3:34 PM

 

ధర్పల్లి, ఆగస్ట్ 22:

ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు నెలల క్రితం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న దేవరకొండ ప్రసాద్‌కు తిరిగి అతని ఫోన్ లభించగలిగింది. మొబైల్ కోల్పోయిన వెంటనే ప్రసాద్ ధర్పల్లి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీస్‌ శాఖ CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌లో వివరాలు నమోదు చేసింది.

తాజాగా, శుక్రవారం పోలీసు అధికారులు ఆ మొబైల్‌ను రికవరీ చేయగలిగారు. దేవరకొండ ప్రసాద్‌ను స్థానిక పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ఎస్‌ఐ ఎం. కళ్యాణి అతనికి మొబైల్‌ను అధికారికంగా అప్పగించారు. బాధితుడు పోలీసుల చర్యపై సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై కళ్యాణి మాట్లాడుతూ, “ప్రజలు తమ మొబైల్‌ ఫోన్‌ కోల్పోతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అలాగే CEIR పోర్టల్ ద్వారా మొబైల్‌ లాక్ చేసుకోవడం వల్ల దొంగలు ఉపయోగించలేరని” సూచించారు.

13 Jan 2026

Leave a Comment