ఎ9 సిద్దిపేట న్యూస్ ఆగస్ట్ 20
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా “నిరుపేదల కుల సాధన సమితి “సిద్దిపేట జిల్లా కన్వీనర్ కమిటీ తరఫున విజ్ఞాపన చేస్తున్నాం. రైతుల డిమాండ్ కు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలి. జిల్లా సొసైటీలకు వ్యవసాయ కేంద్రాలకుయూరియా ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేయాలి, అరకొర పంపిణీతో చాలామంది రైతులకు యూరియా అందడంలేదు.డిమాండ్ తగ్గట్టుగా రైతులకు యూరియా పంపిణీ చేయాలని కోరుతున్నాం. అందులో భాగంగా రైతాంగం తమ వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని పశువులకు మేత వేయకుండా కేవలం యూరియా కోసమే గత రెండు మూడు రోజులుగా క్యూలైన్లలో నిలుచుండడం అంటే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆలోచించి. రైతాంగానికితగిన న్యాయం చేయాలని కోరుతున్నాం అందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో రైతులు సిద్దిపేట, గజ్వేల్ ,వరంగల్, సిరిసిల్ల ,కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ ,మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం ,భూపాలపల్లి ,కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ,తాండూర్ ,చేవెళ్ల లాంటి అనేక జిల్లాల్లో రైతాంగం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనకు మద్దతుగా మా నిరుపేదల హక్కుల సాధన సమితి మద్దతును సంఘీభావాన్ని తెలియజేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని రైతాంగానికి సరిపడా యూరియా తెప్పించి అందివ్వాలని కోరుతున్నాం. అలాగే బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సరఫరా చేస్తున్న యూరియా ఏ మూలకు సరిపోదు కావున రైతులకు తగిన ఎరువులు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
నిరుపేదల హక్కుల సాధన సమితి .
సిద్దిపేట జిల్లా కమిటీ జిల్లా కన్వీనర్ మూర్తి ఆదిరెడ్డి అని తెలిపారు.








