జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్….

On: Tuesday, October 14, 2025 2:02 PM

 

ఆర్మూర్, అక్టోబర్ 14 (A9 న్యూస్):

జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై తక్షణ చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్‌కి వినతిపత్రం అందజేశారు.

జర్నలిస్టుల పట్ల పోలీస్ సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. పోలీస్ సిబ్బంది దినేష్, అశోక్ జర్నలిస్టుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, కావాలని ప్రెస్ క్లబ్ సభ్యుల వాహనాలకు జరిమానాలు వేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ పరిస్థితి కొనసాగితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ పార్దెం, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు పద్మారావు, సీనియర్ జర్నలిస్టులు సాత్పూతే శ్రీనివాస్, రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, నరేందర్ మనోహర్, క్రాంతి కుమార్, చరణ్ గౌడ్, మహిపాల్, గణేష్, సురేందర్ గౌడ్, గణేష్ గౌడ్, అరుణ్, చిరంజీవి, సురేష్, సురేష్ బాబు, అశోక్, చేతన్, కిరణ్, దినేష్, యఫై, రితీష్, రాకేష్, వెంకటేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

11 Nov 2025

Leave a Comment