హైదరాబాద్:అక్టోబర్ 24
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం గురువారం సుదీర్ఘంగా చర్చించింది, బీసీ రిజర్వేషన్ పై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు సుప్రీంకోర్టు తీర్పుల నేప థ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్ళవలసి ఉంటుందని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మంత్రివర్గ సమావేశం అనంతరం… రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ,వాకీటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు,ఎంపీ బలరాం నాయక్,లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం వచ్చే నెల 3న హైకోర్టులో విచారణకు రానుంది, కాబట్టి.. ఆ రోజున వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించిందన్నారు.
వచ్చే నెల 7న రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకో వాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నందున.. ఈ సమావే శానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హాజరు కాలేకపోయారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేం దుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందు కు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలగించాలని మంత్రి మండలి నిర్ణయించింది. అసెంబ్లీ ప్రొరోగ్ అయి నందున చట్ట సవరణకు గవర్నర్ ఆమోదంతో ఆర్డి నెన్స్ తేవాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ ప్రతిపాదన దస్త్రాన్ని మంత్రివర్గం ఆమోదిం చింది.








