ఖమ్మం జిల్లా: అక్టోబర్ 31
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధిర శాసనసభ నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సిపిఎం సీనియర్ నేత సామినేని రామారావు ను అత్యంత పాశవికంగా గుర్తు తెలియని దుండగు లు హత్య చేశారు..
వివరాల్లోకి వెళ్తే.. సామినేని రామారావు రోజూ మాదిరి గానే శుక్రవారం మార్నింగ్ వాక్ కు వెళ్లారు. ఆ సమ యంలో మార్గమధ్యంలో ఆయన్ను అడ్డగించిన దుండగులు, పదునైన ఆయుధంతో గొంతుకోసి హతమార్చారు. రక్తపు మడుగులో పడివు న్న ఆయన్ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరు కున్నారు. పరిసరాలను పరిశీలించి, సాక్ష్యాధారా లను సేకరించే పనిలో పడ్డారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఈ హత్య వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు ప్రారం భించారు. ఈ ఘటనతో పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








