హైదరాబాద్:అక్టోబర్ 09:
దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లో మూత్రపిండాల వైఫల్యం కారణంగా 20 మంది మరణించిన కేసులో చర్యలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కోల్డ్‌రిఫ్ దగ్గు మందు తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్‌ను, అరెస్టు చేశారు. పోలీసులు గురువారం ఉదయం చెన్నై లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
శ్రేసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్ రిఫ్ దగ్గు మందు తాగి ఒక్క మధ్య ప్రదేశ్‌లోనే 20 మంది దాకా చిన్న పిల్లలు చనిపోయా రన్న ఆరోపణలు ఉన్నా యి. పోలీసులు రంగనాథన్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం అరెస్ట్ చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలోనూ కోల్డ్‌రిఫ్ తాగి చాలా మంది చిన్నపిల్లలు చనిపోయా రన్న ఆరోపణలు ఉన్నా యి. దగ్గు మందు తాగిన తర్వాత పిల్లలు కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు కోల్డ్‌రిఫ్ దగ్గు మందు విని యోగాన్ని నిషేధించాయి.








