లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు…..

On: Monday, August 25, 2025 3:24 PM

ఎ9 న్యూస్, మాసాయిపేట – ఆగస్టు 25:

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో 12వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ నాయకులు సందర్శించారు.

ఈ సందర్శన సందర్భంగా వారు లబ్ధిదారులతో మాట్లాడుతూ, “ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు భయపడకండి. సమస్యలు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి పరిష్కారం పొందండి,” అని ధైర్యం ఇచ్చారు. అలాగే, ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద లబ్ధిదారులకు బిల్లులు మంజూరవుతాయని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గుండారం శ్రీనివాస్, భూస్వామి, ఉదుండపురం నర్సింహులు లాంటి లబ్ధిదారులు పాల్గన్నారు.

14 Feb 2026

Leave a Comment