ఎ9 న్యూస్, మాసాయిపేట – అక్టోబర్ 11:
బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్నినిలబెట్టుకోలేకపోతున్నదని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా బీసీలకు రిజర్వేషన్ పెంచుతామన్నారు. కానీ ఇప్పుడు అదే సీఎం, తన పార్టీలోని OC నాయకులతో కలిసి ఆ బిల్లును కోర్టులో నిలిపివేయడం వెనుక నిజమైన ఆలోచన ఏమిటో బీసీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
“బిల్లుపై కోర్టు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో సరైనదా, సరికాదా అనే విషయం కూడా ప్రభుత్వానికే స్పష్టంగా తెలియడం లేదు,” అని నవీన్ యాదవ్ ఎద్దేవా చేశారు.అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులను ఉద్దేశిస్తూ,”మీకు నిజంగా బీసీల పట్ల నిబద్ధత ఉంటే, వెంటనే ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి బిల్లును అమలుచేయించండి. లేకపోతే పార్టీని వీడి బీసీల హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో భాగస్వాములవ్వాలి,” అని డిమాండ్ చేశారు.
ఆయన మాట్లాడుతూ:
“ఇది బీసీలపై స్పష్టమైన ద్రోహం. న్యాయం కోరే బీసీలకు ఇప్పుడు ఐక్యత అవసరం. ‘జై BC! BCల ఐక్యత వర్ధిల్లాలి!’ అనే నినాదాలతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది,” అని పిలుపునిచ్చారు. నవీన్ యాదవ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి, మాసాయిపేట.








