బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ – మాసాయిపేట మాజీ సర్పంచ్ చిట్టిమిళ్ల నాగరాజు….

On: Saturday, October 11, 2025 9:17 AM

 

మాసాయిపేట, అక్టోబర్ 11 (A9 న్యూస్):

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు జీవోలు జారీ చేసి, ఎన్నికలకు వేళ్ళిద్దాం అంటూ మాయమాటలు చెప్పిందని మాజీ సర్పంచ్ చిట్టిమిళ్ల నాగరాజు తీవ్రంగా విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తీసుకొచ్చిన జీవోలను న్యాయస్థానం తిరస్కరించిన తర్వాత కూడా, ప్రభుత్వం డ్రామా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

“బీసీ బిడ్డల గొంతుకలను వినకుండా, వాళ్లను మోసం చేయడమే ఈ ప్రభుత్వ ధోరణి. గతంలో ఇదే విధంగా మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, ఇప్పుడు మళ్లీ బీసీల ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తోంది,” అని వ్యాఖ్యానించారు. గ్రామ, పట్టణాలలో పోటీకి సిద్ధమైన నాయకులు ఇప్పుడు ఖర్చులకు నోచుకొని, అసంతృప్తిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

“420 హామీల తరహాలోనే 42% రిజర్వేషన్లపై డ్రామాలు ఆడుతున్న కాంగ్రెస్, ఢిల్లీ వేదికపై పోరాటం చేయకుండా గల్లీల్లో యాక్టింగ్ చేస్తోంది,” అని ఎద్దేవా చేశారు. బీసీలను మోసపుచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారని నమ్మకంగా చెప్పారు.

11 Nov 2025

Leave a Comment