కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ ఐటిఐ కళాశాలను సందర్శించిన కలెక్టర్….

On: Wednesday, October 15, 2025 8:27 AM

హైదరాబాద్ పల్స్ న్యూస్ అక్టోబర్ 14, (బాల్కొండ)

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పరిశ్రమిక శిక్షణ కేంద్రాన్ని (ఐటీఐ) జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన నూతనంగా నిర్మించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను పరిశీలించారు.మిషన్ వర్క్ ల్యాబ్,హాస్టల్ వసతి,పవర్ కనెక్షన్, ఫర్నిచర్,సివిల్ వర్క్, ట్రాన్స్పరెన్సీ వంటి అంశాలపై కేంద్ర ప్రిన్సిపల్ కోటిరెడ్డితో కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు.

శిక్షణా కార్యక్రమాల ప్రగతిపై పలు సూచనలు చేస్తూ,విద్యార్థులకు మరింత నాణ్యమైన శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సదుపాయాలు,యంత్రాల వినియోగం,హాజరు నమోదు వంటి అంశాలను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో రాజా శ్రీనివాస్,ఎంపీవో సదాశివ్,ఆర్‌ఐ శరత్, ట్రైనింగ్ ఆఫీసర్ ఏటీవో సంతోష్, ఐటీఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

11 Nov 2025

Leave a Comment