తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్ల తో సీఎం రేవంత్ రెడ్డి, వీడియో కాన్ఫరెన్స్…

On: Thursday, October 30, 2025 3:39 PM

 

హైదరాబాద్:అక్టోబర్ 30

తెలంగాణ లో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులకు సూచించారు ప్రతి ఒక్కరూ ఫీల్డ్ లో ఉండవలసిందే రిపోర్టు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.మొంథా తుఫాన్‌ నేపథ్యం లో సీఎం రేవంత్‌ రెడ్డి, ఈ రోజు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమం లో ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ఇది వరి కోతల కాలం… అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోంద న్నారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశా లు ఇచ్చారు. ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగగుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్ వే ల వద్ద, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలన్నారు.

ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలి. అవసరమైనచోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసు కోవాలని సూచించారు. వరంగల్ లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట హైడ్రా సేవలను వినియోగించుకోవాలన్నరు.

24 గంటలు ఎప్పటిక ప్పుడు పరిస్థితులను సమీక్షించాలి. అధికారుల తో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటిక ప్పుడు సమాచారాన్ని సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలపాలన్నారు.

వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు.ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఎప్పటిక ప్పుడు పర్యవేక్షించాలి. ప్రాణనష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదన్నారు.

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ్టి వరంగల్ ఆకస్మిక పర్యటన వాయిదా వేసుకున్నానన్న రేవంత్ రెడ్డి రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తాన న్నారు. తుఫాను ప్రభావిత జిల్లా ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటు లో ఉండాలన్నారు.

క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేయా లని సూచించారు.ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్య మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

11 Nov 2025

Leave a Comment