పదవ తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్….

On: Thursday, October 23, 2025 8:51 PM

 

హైదరాబాద్:అక్టోబర్ 23

తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి-2026 కు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ప్రభుత్వం షెడ్యూల్ గురువారం విడుదల చేసింది.పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు, అలాగే ఇదివరకు ఫెయిల్ అయిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి ఈ గడువులను ప్రకటించారు.

లేట్ ఫీజు లేకుండా ఫీజు చెల్లించడానికి అక్టోబర్ 30, నుండి నవంబర్ 13, వరకు గడువుగా నిర్ణయించారు. విద్యార్థులు కట్టిన మొత్తా న్ని పాఠశాల హెచ్‌ఎంలు ఈ ఫీజును నవంబర్ 14 లోపల ట్రెజరీకి అంద చేయాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు హెచ్‌ఎంలకు నవంబర్ 18, 2025 వరకు గడువు ఇవ్వబడింది.

వీటితోపాటు లేట్ ఫీజు చెల్లింపులకు సంబంధించిన గడువులు కూడా ప్రకటించారు. రూ. 50 లేట్ ఫీజుతో నవంబర్ 15 నుండి నవంబర్ 25 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ. 200 లేట్ ఫీజుతో నవంబర్ 29 నుండి డిసెంబర్ 12 వరకు చెల్లింపులు చేయవచ్చు.

ఇక రూ. 500/- లేట్ ఫీజుతో అయితే, డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. డీజీఈ కార్యాలయం ఈ గడువు లను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టంగా తెలిపింది.

ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేసీఆర్ కీలక సమావేశం!

ఇక పరీక్ష ఫీజు వివరాల విషయానికి వస్తే.. అన్ని సబ్జెక్టులకు ఫీజు రూ. 125/- గా నిర్ణయించబడింది. మూడు సబ్జెక్టుల వరకు ఫీజు రూ. 110/- చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే రూ. 110/- తో పాటు, ప్రతి అదనపు రెగ్యులర్ పరీక్షా సబ్జెక్టుకు రూ. 60/- చొప్పున అదనంగా చెల్లించాలి. ఈ ఫీజు నిబంధన SSC/OSSC/వొకేషనల్ కోర్సుల్లోని అకాడమిక్ సబ్జెక్టులకు కూడా వర్తిస్తుంది.

11 Nov 2025

Leave a Comment