క్యారమ్ బోర్డ్ ఆడుతున్న బాల గణేశుడు – భక్తుల దృష్టి ఆకర్షణ….

On: Saturday, August 30, 2025 8:54 PM

 

భక్తులను అలరిస్తున్న ఆర్మూర్ గణనాథుడి కొత్త రూపాలు.

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలో గణేష్ నవరాత్రుల సందడి వినూత్న ప్రతిమలతో మరింత శోభాయమానంగా మారింది.

చిన్న బజార్‌లోని ఈగల్ యూత్ గణేష్ మండపం నిర్వాహకులు వినూత్న ఆలోచనతో ప్రత్యేక ప్రతిమను ప్రతిష్టించారు. అందులో బాల గణేశుడు తన వాహనం ఎలుకతో కలిసి క్యారమ్ బోర్డ్ ఆడుతూ కనిపించడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇక పట్టణంలోని పోచమ్మ గల్లీలోని కాత్యాయని యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపంలో మరో కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. కోర్ట్ తరహాలో అలంకరించిన మండపంలో, జడ్జి వేషధారణలో గణపతి ప్రతిమను ప్రతిష్టించి భక్తులను ఆకర్షిస్తున్నారు. ఈ వినూత్న ప్రతిమలు సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తున్నాయి.

15 Feb 2026

Leave a Comment