*చేగుంట ప్రభుత్వ కళాశాల ఫ్రెషర్స్ డే…
*దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి….
A9 న్యూస్ చేగుంట:
మెదక్ జిల్లా చెగుంట పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శుక్రవారం ఫ్రెషర్స్ డే కార్య క్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించి వారికి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. విలువలతో కూడిన విద్యను,అభ్యసించాలని కష్టపడి ఇష్టపడి చదివి మంచి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అధ్యాపకులు విద్యార్థులను మంచి క్రమశిక్షణతో మెలగే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదవాలని, స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కట్టించిన కళాశాల పేరును నిలబెట్టే విధంగా మెలగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, చేగుంట మాజీ ఏఎంసీ చైర్మన్ రజనక ప్రవీణ్ కుమార్, పిఎ,సిఎస్, చైర్మన్ మన తెలంగాణ జర్నలిస్ట్ ఐతె రఘురాం, ఐతె పరంజ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ కర్రి అనిత, కళాశాల సిబ్బంది, చేగుంట సబ్ ఇన్స్పెక్టర్ చైతన్య రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.







