ఆర్మూరులో గణేష్ నిమజ్జనంలో నిబంధనలు ఉల్లంఘించిన డీజేలు – ముగ్గురిపై కేసు…..

On: Thursday, September 4, 2025 6:35 PM

 

ఆర్మూర్, సెప్టెంబర్ 4:

గణేష్ నవరాత్రుల 9వ రోజు నిమజ్జన ఉత్సవాల్లో నిబంధనలు అతిక్రమించి డీజే పరికరాలు వినియోగించిన ఘటనపై ఆర్మూర్ పోలీసులు మూడు మంది వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం:

కళ్లగడ్డ ప్రణయ్ – బడా భీంగల్ గ్రామం.

సంఘ శివకృష్ణ – లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా.

పుల్లంటి శివకుమార్ – వడ్యాట్ గ్రామం, మోర్తాడ్ మండలం.

ఈ వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వాడినట్లు గుర్తించి, పోలీసులు సంబంధిత పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీకి ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ పర్యవేక్షణ అందించారు.

పోలీసులు ప్రజలను శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఏవైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

15 Feb 2026

Leave a Comment