మాసాయిపేటలో బీఆర్ఎస్ రాస్తారోకో – సిబిఐ ఎంక్వైరీపై తీవ్ర అభ్యంతరం…..

On: Thursday, September 4, 2025 9:31 AM

 

ఎ9 న్యూస్ – మాసాయిపేట, సెప్టెంబర్ 4:

మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 44పై బీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టారు. సిఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణను నిరసిస్తూ, అలాగే యూరియా సరఫరాలో జాప్యం జరిగిందని పేర్కొంటూ ఈ ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు “డౌన్ డౌన్ కాంగ్రెస్” నినాదాలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీబీఐ విచారణ ప్రారంభించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. “గత ప్రభుత్వ కాలంలో యూరియా కొరతలు ఏవీ ఉండేవి కాదు. ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారు” అని వారు ఆరోపించారు.

ప్రధాన డిమాండ్లు:

కేసీఆర్‌పై కొనసాగుతున్న సీబీఐ విచారణను తక్షణమే నిలిపివేయాలి.

రైతులకు సకాలంలో యూరియా అందించాలి.

నాయకులు హెచ్చరిస్తూ, “సిబిఐ ఎంక్వైరీ ఆపకపోతే ప్రజలు రోడ్లపైకి వస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల్లో, పట్టణాల్లో కనుమరుగవుతుంది” అని వ్యాఖ్యానించారు.

ఈ రాస్తారోకో కారణంగా హైవేపై కిలోమీటర్ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో మాసాయిపేట బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

15 Feb 2026

Leave a Comment